తెలుగు సినీ పరిశ్రమ (Telugu Cinema)లో నాలుగు దశాబ్దాలకుపైగా విభిన్న పాత్రల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు టాలీవుడ్ యాక్టర్, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad). 45 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఈ సీనియర్ నటుడు ప్రేక్షకుల కోసం కొత్త అడుగు వేశాడు. రాజేంద్రప్రసాద్ తొలిసారి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆహా ఒరిజినల్ సేనాపతి (Senapathi) చిత్రాన్ని ఇవాళ మోషన్ పోస్టర్ తో ప్రకటించారు మేకర్స్.
‘తాత ఏదైనా ఒక కథ చెప్పవా..అని పిల్లాడు అడుగగా..అనగనగా ఓ రాజు..ఆ రాజుకు ఏడుగురు కొడుకులు..ఏడుగురు వేటకెళ్లి ఏడు చెపలు పట్టారట. ఏడు చేపలు ఎండబెడితే ఒక చేప ఎండలేదు. చేప చేప ఎందుకెండలేదు అంటే గడ్డివాము అడ్డమొచ్చిందన్నదట..గడ్డి వాము గడ్డి వాము ఎందుకు అడ్డమొచ్చావనడిగితే ఆవు నన్ను మేయలేదని అన్నదట.. ‘అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పే కథతో మోషన్ పోస్టర్ సాగుతుంది.
చివరలో ‘చీమ సమాధానం చెప్పకముందే చంపేశాడు..పుట్టలో వేలు పెడితే కుడతావా..చంపుతా ‘ అంటూ వచ్చే సంభాషణలతో ముగిసింది మోషన్ పోస్టర్ వీడియో. రాజేంద్రప్రసాద్ ఈ సారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మోషన్ పోస్టర్‌తో చెబుతూనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు డైరెక్టర్ పవన్ సాదినేని (Pavan Sadineni). ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి చిత్రాలను డైరెక్ట్ చేశాడు పవన్ సాదినేని.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్