Rajendra Prasad | ఓ వైపు కామెడీని పండిస్తూనే.. మరోవైపు హీరోయిజాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి చూపించే అతి కొద్ది మంది యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) . దశాబ్దాలుగా హీరోగా అలరిస్తున్న నటకిరీటిగా పేరు సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ చాలా కాలం నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్ రోల్స్‌లో కనిపిస్తున్నారు.
ఇటీవల కాలంలో వస్తున్న సినిమాలపై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. మ్యాగీ దర్శకత్వంలో శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ హరికథ. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 13న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా.. నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే దొంగ.. వాడు హీరో.. హీరోల్లో అర్థాలు మారిపోయాయి.. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా నేను సమాజంలో మన చుట్టూ ఉన్నట్వంటి పాత్రలతో డిఫరెంట్ హీరో అనిపించుకున్నా.. అంటూ కామెంట్ చేశాడు.
రాజేంద్రప్రసాద్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన పుష్ప 2 ది రూల్ మూవీని ఉద్దేశించి చేసినవే ఈ వ్యాఖ్యలు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Senior Actor #RajendraPrasad Gaaru About #Pushpa Series 🙄🙄 pic.twitter.com/81koORXixM
— TalkEnti (@thetalkenti) December 9, 2024
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్