RRR Release date | బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా గురించి టాలీవుడ్ మాత్రమే కాదు.. దేశమంతటా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. నిజానికి ఈ సినిమా ఈపాటికి రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా చాలా ఆలస్యమైంది. అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేస్తామని ముందుగా మేకర్స్ ప్రకటించినా కూడా ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
Experience India’s Biggest Action Drama, #RRRMovie in theatres worldwide on 7th Jan 2022. 🤟🏻#RRROnJan7th 💥💥
— RRR Movie (@RRRMovie) October 2, 2021
An @ssrajamouli Film. @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies @PenMovies @jayantilalgada @LycaProductions pic.twitter.com/wKtnfeCJN7
సంక్రాంతి పండుగకు వారం ముందు అంటే జనవరి 7న రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా సినిమా పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ డేట్పై కొంతకాలంగా చాలా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతోందని సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ జనవరి 7న సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కరోనా కారణంగా థియేటర్ల మూతపడటంతో దాదాపు ఏడాదికాలంగా పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో 2022 సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భీమ్లా నాయక్, మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ట్రిపుల్ఆర్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుండటంతో ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా లేదనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR ముందున్న టార్గెట్ తెలిస్తే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం..
Ntr: జూనియర్ ఎన్టీఆర్ క్రికెట్ చూడకపోవడానికి ఆయన తండ్రే కారణమట..!
RRR | రాజమౌళిపై టాలీవుడ్ నిర్మాతల అసంతృప్తి
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?