RRR ముందున్న టార్గెట్ తెలిస్తే కళ్లు బైర్లు గమ్మడం ఖాయం..

RRR | రాజమౌళి సినిమాలకు ఇప్పుడు బిజినెస్ ఎంత జరుగుతుందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాలా..? ముఖ్యంగా బాహుబలి తర్వాత ఈయన సినిమాల బిజినెస్ స్థాయి వందల కోట్లకు చేరిపోయింది. బాహుబలి రెండు భాగాలు కలిపి 2400 కోట్ల వరకు వసూలు చేసింది. అందుకే ఇప్పుడు తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి దేశం అంతా ఆసక్తిగా వేచి చూస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య ట్రిపుల్ ఆర్ సినిమా నిర్మిస్తున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ ఇవన్నీ లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఏదైనా ఒక్క అప్డేట్ తెలిసినా కూడా పండగ చేసుకుంటున్నారు అభిమానులు.
ఈ సినిమా బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. అక్టోబర్ 13న విడుదల అంటూ మొన్నటి వరకు ఊరించినా కూడా చివరికి ఉసూరుమనిపించాడు రాజమౌళి. పోస్ట్ ప్రొడక్షన్ పేరు చెప్పి మళ్లీ వాయిదా వేశాడు. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి కొన్ని లెక్కలు బయటికి వస్తున్నాయి. 700 కోట్ల వరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. తెలుగులోనే 240 కోట్లకు పైగా ట్రిపుల్ ఆర్ బిజినెస్ జరుగుతుంది. ఇక ఓవర్సీస్, హిందీ, మిగిలిన రాష్ట్రాలు కలిపి మరో 500 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది. పైగా మొన్న ఓ షోకు వచ్చిన ఈ చిత్ర రైటర్ విజయేంద్ర ప్రసాద్ సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం గురించి నోరు జారాడు ఈ సీనియర్ రైటర్.
ట్రిపుల్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అని తెలిపాడు. ఇద్దరు మంచి వాళ్లు కొట్టుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే కంటి నుంచి నీళ్లు వస్తాయంటూ అసలు విషయం బయట పెట్టాడు విజయేంద్ర ప్రసాద్. ఈ సన్నివేశం రాజమౌళి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు అని ప్రశంసించాడు. కచ్చితంగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని బల్లగుద్ది చెబుతున్నాడు. ఈ సినిమాలో కీలకమైన సన్నివేశం గురించి బయట పడిపోవడంతో ఇప్పుడు దానిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇంత భారీగా ఉండబోతుంది కాబట్టే బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. ఏదేమైనా 700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మాటలు కాదు.. మరి దాన్ని ట్రిపుల్ ఆర్ ఎంతవరకు అందుకుంటుందో చూడాలిక.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయిన పోసాని.. చిరంజీవిని పొగుడుతూనే..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని
సితార సినిమాలు చేస్తుంది.. కానీ మహేశ్ పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

