mahesh babu daughter sitara | సోషల్ మీడియాలో మహేశ్ బాబు కూతురు సితారకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అన్నయ్య గౌతమ్ కృష్ణను ఎప్పుడో దాటేసింది సితార పాప. ఇంకా చెప్పాలంటే కొంత మంది హీరో హీరోయిన్లకు కూడా లేని ఫాలోయింగ్ సితారకు సోషల్ మీడియాలో వచ్చేసింది. అంతేకాదు వంశీ పైడిపల్లి కూతురు సితారకు బెస్ట్ ఫ్రెండ్. ఆ చిన్నారితో కలిసి సితార యూ ట్యూబ్ వీడియోలు కూడా చేస్తుంది. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఘట్టమనేని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. మహేశ్ కూడా కూతురుకు ఇష్టం ఉందంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటున్నాడు.
మంచి కథ దొరికినపుడు కచ్చితంగా సితార నటిస్తే తనకు కూడా చూడాలని ఉంది అంటున్నాడు. నేనొక్కడినే సినిమాతో గౌతమ్ చిన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు మహేశ్ బాబు తనయుడు. సితార విషయంలో కూడా మహేశ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని చాలా రోజుల నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక సినిమాలో కచ్చితంగా సితార పాప కనిపిస్తే బాగుంటుంది అని వాళ్లు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేశ్ బాబు ఒక షాకింగ్ విషయం చెప్పాడు.
సితారకు సినిమాలంటే ఇష్టమే.. నటించడం అంటే కూడా ఇష్టమే.. కానీ తెలుగు సినిమాలలో నటించడం అంటే ఇష్టం లేదు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనకు ఇంగ్లీష్ సినిమాలు అంటే ఎక్కువగా ఇష్టమని తెలిపాడు మహేశ్ బాబు. తన కూతురు ఎక్కడ నటిస్తాను అని అడిగినా కూడా దానికి సపోర్ట్ చేయడం బాధ్యతగా ఫీల్ అవుతాను అంటున్నాడు. వీలైనంత త్వరగా సితార వెండితెరపై కనిపిస్తే చూడాలని ఘట్టమనేని అభిమానులు భావిస్తుంటే.. మహేశ్ బాబు మాటలు విన్న తర్వాత అది ఇప్పట్లో జరగదు అని క్లారిటీ వచ్చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయిన పోసాని.. చిరంజీవిని పొగుడుతూనే..
మీరు నవ్వితే ప్రపంచం ఆగిపోతుంది..దీపికాపదుకొనే స్టిల్‌పై అభిమాని
తండ్రి, కొడుకుల మధ్య ముదురుతున్న వివాదం.. ఆందోళనలో విజయ్ ఫ్యాన్స్
మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి, పవన్ అంతా నాకే ఓటేస్తారు: మంచు విష్ణు
పుష్ప టీమ్ సర్ప్రైజ్.. రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది