Raja Saab | గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ (Raja Saab) చేస్తున్నాడని తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్ పోస్టర్ ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా రాజాసాబ్‌కు సంబంధించిన వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
హ్యారీ పోటర్ ఫాంటసీ నవలా సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజాసాబ్‌ను హ్యారీ పోటర్‌తో పోల్చి సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు టీ సిరీస్ ఎండీ భూషణ్ కుమార్. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. మేము రాజాసాబ్ మ్యూజిక్ రైట్స్ కొనుగోలు చేశాం. ఈ హార్రర్ కామెడీ సినిమాకు సంబంధించి కొన్ని విజువల్స్ చూశా. రాజాసాబ్ కొంచెం హారీ పోటర్ లైన్లో సాగుతూ.. ప్రేక్షకులకు ఆ వైబ్ అందించే ఆసక్తికర సన్నివేశాలు, కథనంతో ఉండబోతుందన్నాడు.
ఇప్పుడీ కామెంట్స్‌తో మారుతి- ప్రభాస్ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోతున్నాయి. రాజాసాబ్‌లో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
రాజాసాబ్ మోషన్ పోస్టర్..
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?