Raghava Lawrence | నటుడిగా, కొరియోగ్రఫర్‌గా, దర్శకనిర్మాతగా మల్టీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న స్టార్ సెలబ్రిటీల్లో ఒకడు రాఘవా లారెన్స్ (Raghava Lawrence). తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న లారెన్స్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. లారెన్స్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి బుల్లెట్టు బండి (Bullettu Bandi).
ఇవాళ లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. మంటల మధ్య గుర్రం కనిపిస్తుండగా.. లారెన్స్ సిగరెట్ తాగుతూ సూపర్ స్టైలిష్ కాప్ అవతార్‌లో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ లుక్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. ఇన్నసి పాండ్యన్ కథనందిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్లో కథిరేశన్ నిర్మి్స్తున్నారు.
రాఘవా లారెన్స్ లుక్..
Here’s the electrifying Telugu first look of @offl_Lawrence master in #BullettuBandi 🔥🔥#HappyBirthdayRaghavaLawrence pic.twitter.com/UzolQKS2Zw
— BA Raju’s Team (@baraju_SuperHit) October 29, 2024
Zebra | సత్యదేవ్ జీబ్రా కొత్త విడుదల తేదీ వచ్చేసింది..