కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం జిగర్తాండ (Jigarthanda). సిద్దార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా 8 ఏండ్ల తర్వాత సీక్వెల్ రెడీ అయింది.
స్టార్ యాక్టర్లు రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ లో నటిస్తున్న సీక్వెల్ చిత్రం జిగర్తాండ 2 (Jigarthanda). గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న జిగర్తాండ 2 టీజర్‌ను (Jigarthanda 2 teaser) మేకర్స్ లాంఛ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రానికి జిగర్తాండ డబుల్ ఎక్స్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
లారెన్స్ సర్ప్రైజ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా.. ఎస్జే సూర్య సూట్లో క్లాసీ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇద్దరూ పోటీపడి మరి నటించి అభిమానులకు కావాల్సిన ఫుల్ మాస్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నట్టు కార్తీక్ సుబ్బరాజ్ టీజర్‌తో చెప్పేస్తున్నాడు.
3 నిమిషాల 4 సెకన్లపాటు కట్ చేసిన టీజర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో చూపించి.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యాడు కార్తీక్‌సుబ్బరాజు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది.
జిగర్తాండ 2 టీజర్…
Read Also :Dhananjaya | కష్టపడకుంటే ఎవరూ సక్సెస్ కాలేరు.. రష్మికకు ధనంజయ మద్దతు
Read Also : Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
Read Also :RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!
" Jigarthanda DoubleX "
Here's A Kind of… Teaserhttps://t.co/3OqBPOeico
⭐️ ing @offl_Lawrence @iam_SJSuryah
A @Music_Santhosh Musical
Produced by @kaarthekeyens @stonebenchers @kathiresan_offl@DOP_Tirru sir Visuals #JigarthandaDoubleX #AKindofTeaser pic.twitter.com/RLkXlqIe24
— karthik subbaraj (@karthiksubbaraj) December 11, 2022