Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
ఇప్పటికే వీరసింహారెడ్డి (veerasimhareddy) నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. రెండో సాంగ్ సుగుణ సుందరి డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వీరసింహారెడ్డి (veerasimhareddy). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్ సాంగ్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్.
రెండో సాంగ్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వీరసింహారెడ్డి జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో బాలయ్య మాస్ ఎనర్జీని చూసి ఎంజాయ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. బాలకృష్ణ, శృతిహాసన్ మధ్య వచ్చే ఈ డ్యుయెట్ సాంగ్‌ను టర్కీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవనుంది. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు ధునియా విజయ్. బాలకృష్ణ, ధునియా విజయ్ మధ్య సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా ఉండబోతున్నారని ఫిలిం నగర్ సర్కిల్ టాక్.
సుగుణసుందరి సాంగ్ స్టైలిష్, రొమాంటిక్ అప్డేట్..
#VeeraSimhaReddy second single #SugunaSundari out on 15th Dec 💥
Watch out for Balayya's MASS energy in this one ❤️🔥
Grand Release on 12th Jan, 2023 🔥#NandamuriBalakrishna @megopichand @shrutihaasan @OfficialViji @varusarath5 @MusicThaman @SonyMusicSouth pic.twitter.com/vVCf7nSW8w
— Mythri Movie Makers (@MythriOfficial) December 11, 2022
Read Also :Dhananjaya | కష్టపడకుంటే ఎవరూ సక్సెస్ కాలేరు.. రష్మికకు ధనంజయ మద్దతు
Read Also :RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

