పుష్ప సినిమాతో నార్తిండియాలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). త్వరలోనే పుష్ప 2 షూటింగ్లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కాగా తనపై కన్నడ ఇండస్ట్రీ (kannada industry) నిషేధం విధించిందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలపై రష్మిక మందన్నా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
తనపై కన్నడ సినీ ఇండస్ట్రీ నిషేధం విధించిందన్న వార్తలను కొట్టిపారేస్తూ.. నాపై శాండల్‌వుడ్ ఎలాంటి నిషేధం విధించలేదని రష్మిక పేర్కొన్నది. ఈ నేపథ్యంలో పుష్ప కో స్టార్ ధనంజయ (Dhananjaya) రష్మికకు మద్దతుగా నిలిచాడు. నిషేధానికి సంబంధించిన విషయాలేమి తనకు తెలియదన్నాడు ధనంజయ. ఫిలిం ఇండస్ట్రీ అందరికీ స్వాగతం పలుకుతుందని, కష్టపడకుండా ఎవరూ సక్సెస్ కాలేరని అన్నాడు. రష్మిక మందన్నా ఎప్పుడూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని, ఆమె ఎదుగుదలను ప్రశంసించాల్సిందేనన్నాడు ధనంజయ.
కాంతార సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్యాహం చూపించారు. కాంతార సినిమా చూసి చిత్రయూనిట్‌కు మెసేజ్ పెట్టాను. నటీనటుల మధ్య ఏం జరుగుతుందనేది ప్రపంచానికి తెలియదు. నా పర్సనల్ విషయాలు కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేనని పుకార్లపై రష్మిక క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప.. ది రూల్‌పై అభిమానులు, మూవీ లవర్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Read Also : RRR | 24 ఏండ్ల తలైవా రికార్డును బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్.. వివరాలివే..!
Read Also : Veerasimhareddy | వీరసింహారెడ్డి నుంచి సుగుణ సుందరి సాంగ్ టైం ఫిక్స్
Read Also : Prasanna Kumar Bezawada | నాగార్జున నెక్ట్స్ సినిమా రీమేక్.. రైటర్ ప్రసన్న కుమార్ ఏం చెప్పాడంటే..?