టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు రాధేశ్యామ్ (Radhe Shyam). యూనివర్సల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. రాధా కృష్ణకుమార్ (Radha Krishna Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడ్డ నేపథ్యంలో అదే మార్గంలో రాధేశ్యామ్ కూడా వెళ్లనుందన్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రభాస్ అభిమానుల కోసం డైరెక్టర్ రాధాకృష్ణకుమార్ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. సమయం క్లిష్టమైనది. మనస్సు బలహీనమైనది. జీవితంలో మనపై ఏది పడ్డా..మన అంచనాలు మాత్రం ఆకాశంలో ఉంటాయి. సురక్షితంగా ఉండండి..ఎత్తులో ఉండండి..రాధేశ్యామ్ టీం అంటూ ట్విటర్ లో సందేశం పోస్ట్ చేశాడు.
ఇది చూసిన ఓ అభిమాని రాధేశ్యామ్ వాయిదా పడుతుందిన పరోక్షంగా చెబుతున్నారా..? అడుగగా..అలాంటిదేమైనా ఉంటే డైరెక్టుగా..అధికారికంగా చెప్తాం అని ట్వీట్ పెట్టాడు. రాధాకృష్ణ కుమార్ తాజా ట్వీట్‌తో మేకర్స్ సినిమాను వాయిదా వేసే ఆలోచన ఏమీ చేయడం లేదని తెలుస్తోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Times are tough, hearts are weak, minds in mayhem. Whatever life may throw at us – Our hopes are always High. Stay safe, stay high – Team #radheshyam
— Radha Krishna Kumar (@director_radhaa) January 4, 2022