ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 05, 2020 , 14:15:40

శ‌రీరాన్ని విల్లులా వంచుతున్న అందాల భామ‌

శ‌రీరాన్ని విల్లులా వంచుతున్న అందాల భామ‌

ఊహలు గుసగుసలాడే  సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌య‌మైన అందాల భామ రాశీ ఖన్నా. స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చూస్తున్న ఈ అమ్మ‌డు ఇటీవ‌ల  'వెంకీమామస‌, 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. చివరిగా విజయ్ దేవరకొండతో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో న‌టించ‌గా, ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది.

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన రాశీ ఖ‌న్నా త‌న‌లోని కొత్త టాలెంట్‌ని ప్ర‌జ‌ల ముందు ఉంచింది. యోగాస‌నాల‌లో భాగంగా త‌న శ‌రీరాన్ని విల్లులా వ‌చ్చి అంద‌రు అవాక్క‌య్యేలా చేసింది. ప్ర‌తి ఒక్క‌రు మీ మీ ఫిట్‌నెస్ మీద దృష్టి పెట్టండ‌ని కోరింది. ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా చేయ‌ని రాశీ ఖ‌న్నా తమిళ్‌లో ఓ రెండు సినిమాల్లో న‌టిస్తుంద‌ని టాక్. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo