టాలీవుడ్ లో సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ టీజర్ బుధవారం సందడి చేయనుంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం 6.12 గంటలకు పుష్ప టీజర్ విడుదల కానుంది.
టీజర్ కోసం డబ్బింగ్ మొదలుపెట్టాడు పుష్పరాజ్. ఇవాళ సుకుమార్, బన్నీ అండ్ టీం పూజా కార్యక్రమంతో డబ్బింగ్ పనులు షురూ చేసింది. బన్నీ ఇదివరకెన్నడూ కనిపించని వైల్డ్ అవతార్ లో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్ మరి బన్నీని ఏ విధంగా చూపించబోతున్నాడో రేపు సాయంత్రం వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.
#Pushpa Dubbing starts
— BA Raju's Team (@baraju_SuperHit) April 6, 2021
Get ready to meet the ferocious #PushpaRaj tomorrow at 6:12 PM @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie @MythriOfficial pic.twitter.com/RuqXGaaDIa
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్