Pushpa The Rule | ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో దర్శకుడు సుకుమార్ పనితీరుపై అల్లు అర్జున్ అసంతృప్తితో ఉన్నారని, సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందని, ‘పుష్ప’ పాత్ర కోసం పెంచిన గడ్డాన్ని బన్నీ ట్రిమ్ చేసుకున్నది కూడా ఇందుకేనని పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు నిజం కావని మేకర్స్ ప్రకటించారు. ఈ వార్తల్లో నిజం లేదని ఇవి నమ్మకండి అని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ప్రకటించింది. ఇదిలావుంటే తాజాగా ఈ ఘటనపై నిర్మాత బన్నీ వాసు స్పందించాడు.
పుష్ప గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూసి మేము నవ్వుకుంటున్నాం. అల్లు అర్జున్ గారి పార్టు 15 నుంచి 20 రోజుల లోపు ఉంది. ఇది అయిపోతే షూటింగ్ అయినట్లే. సుకుమార్ ఎడిటింగ్ చూసుకొని ఇంకా ఏమన్నా ఛేంజ్ చేయాలా లేదా అనేది క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అల్లు అర్జున్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని తన గడ్డాన్ని ట్రిమ్ చేశారు. అల్లు అర్జున్ – సుకుమార్లా బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఈ ఫేక్ వార్తలను నమ్మకండి. ఈ వార్తల వలన మాకు ఫ్రీ పబ్లిసిటి వచ్చింది అంటూ బన్నీ వాసు అన్నాడు.
#Pushpa2TheRule – Shoot delay, beard trimming, etc., here is the detailed clarification. pic.twitter.com/MyYLYEcXhu
— Aakashavaani (@TheAakashavaani) July 19, 2024
Also Read..