Shivanna | పుష్ప ది రైజ్ సినిమాలో జాలిరెడ్డి పాత్రతో తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫేం సంపాదించాడు కన్నడ యాక్టర్ ధనుంజయ (Dhananjaya). కన్నడలో సూపర్ పాపులర్ అయిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థియేటర్ ముందు అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా మీ డౌటు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivanna) నటించిన యాక్షన్ థ్రిల్లర్ (Bhairathi Ranagal). ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ మూవీ స్క్రీనింగ్ సందర్భంగా బెంగళూరులోని నర్తకి థియేటర్ వద్ద ధనుంజయ అభిమానులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ధనుంజయ ప్రస్తుతం సీక్వెల్ పుష్ప 2 ది రూల్‌లో నటిస్తుండగా డిసెంబర్ 5న ప్రపంచవ్య్తాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ధనుంజయ మరోవైపు సత్యదేవ్‌తో కలిసి నటిస్తోన్న చిత్రం జీబ్రా. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లలో సందడి చేయనుంది.
శివ రాజ్ కుమార్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ రాంచరణ్ ఆర్సీ 16లో, విజయ్ దళపతి 69లో కీ రోల్స్‌లో నటిస్తున్నాడు.
ధనుంజయ డ్యాన్స్ వీడియో ..
@Dhananjayaka dance after the Bhairathi Ranagal Fans show at Nartaki 🔥#RanagalCelebrations#BhairathiRanagal#BhairathiRanagalNov15#Shivanna #Shivarajkumar #KingShivanna #DrShivarajkumar #DrShivarajkumarUpdates pic.twitter.com/I7eWJpLNu7
— Dr Shivarajkumar updates ™ (@shivannaupdates) November 15, 2024
Daaku Maharaaj | డాకు మహారాజ్‌గా బాలకృష్ణ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న టైటిల్ టీజర్
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట