స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప..ది రైజ్ (Pushpa 1). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది. ఇపుడు ఈ ఇద్దరూ మరోసారి పుష్ప ..ది రూల్ (Pushpa 2) తో సిద్దమవుతున్నారు. పుష్ప 2 ఎప్పుడు ప్రారంభం అవుతుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. వారి కోసం ఓ ఆసక్తికర అప్డేట్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా అప్ డేట్ ఏంటంటే పుష్ప 2 షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో లాంఛ్ కాబోతున్న అల్లు స్టూడియోస్ (Allu Studios)లో మొదలు కానుందట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అల్లు స్టూడియోస్ అక్టోబర్ 1న ప్రారంభం కానుంది. ఇదే నిజమైతే అల్లు రామలింగయ్య సేవలకు కొనసాగింపుగా లాంఛ్ కాబోతున్న అల్లు స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా పుష్ప 2 అవుతుందన్నమాట. బన్నీకి కూడా ఇది చాలా ప్రత్యేకమైన మరిచిపోలేని సందర్భమనే చెప్పాలి.
ఫస్ట్ పార్టును మించి సీక్వెల్‌ను భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 2లో కూడా కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ రోల్లో కనిపించనుంది. ఇక రెండో పార్టులో ఫహద్ ఫాసిల్ పాత్ర కొనసాగింపు ఉండగా..ఈ సారి విజయ్ సేతుపతి కీ రోల్లో కనిపించబోతున్నాడనే టాక్ ఉంది. మరి దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also : Allu Studios | అల్లు స్టూడియోస్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..లాంఛింగ్‌కు ప్రత్యేక అతిథి..!