స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తున్న వన్ ఆఫ్ ది ప్రాజెక్టు శాకుంతలం (Shaakuntalam). టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ (Guna Sekhar)పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీ రోల్లో నటిస్తున్నాడు. అప్‌కమింగ్ పాన్ ఇండియా సినిమాల జాబితాలో ఉన్న శాకుంతలం నుంచి క్రేజీ అప్డేట్ అందించింది గుణ శేఖర్ టీం. శాకుంతలం చిత్రాన్ని నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.
విడుదల తేదీని ప్రకటిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను లాంఛ్ చేసింది. ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
శాకుంతలం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా..శేఖర్ వీ జోసెఫ్ సినిమాటోగ్రఫర్. ప్రవీణ్ పూడి ఎడిటర్.
Witness the #EpicLoveStory #Shaakuntalam in Theatres from Nov 4th 2022 Worldwide!#ShaakuntalamOnNov4 https://t.co/ka4nzfTjX5@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/CxacIRj2XM
— Gunaa Teamworks (@GunaaTeamworks) September 23, 2022
సామ్ మరోవైపు హిందీలో వరుణ్ ధవన్‌తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తోంది. దీంతోపాటు మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కుతున్న యశోదలో టైటిల్ రోల్ చేస్తోంది, విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ ప్రాజెక్టు ఖుషీలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.