అక్కినేని నాగార్జున నటిస్తోన్న ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ఘోస్ట్’ (The Ghost).ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కీ రోల్ చేస్తోంది. అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం నాగార్జున (Nagarjuna ), సోనాల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. గన్స్ వాడకంతోపాటు నాగార్జునకు కత్తిసాముపై శిక్షణ ఇచ్చారు నిపుణులు.
ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ యాక్షన్ పార్టు కోసం టైనింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. తుపాకులు, ఆయుధాలతోనే ఇంటర్ పోల్ ఆఫీసర్ వేట కొనసాగనుండటంతో నాగ్ చాలా ఫోకస్ పెట్టి శిక్షణ తీసుకున్నట్టు వీడియోతో అర్థమవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే నాగ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ది ఘోస్ట్‌లో తమహగనే అనే ప్రత్యేకమైన ఆయుధాన్ని (కత్తి)వినియోగించాడు డైరెక్టర్.
ది ఘోస్ట్ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.