టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ధమాకా (Dhamaka). పెళ్లి సందD ఫేం శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన ( Thrinadha Rao Nakkina) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ అప్డేట్ను కూడా మేకర్స్ సోషల్మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. కాగా ఇపుడు సినిమా విడుదలకు సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ధమాకా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయట.
ధమాకా చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరాగ్ జానీ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నాడు. ప్రముఖ నటీనటులు కీ రోల్స్ చేస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్. రవితేజ మరోవైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమా చేస్తున్నాడు.
రావణాసురతోపాటు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్రావులో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.