Pushpa 2 Villain | కేజీఎఫ్, పుష్ప 2 సినిమాలతో యాక్టర్‌గా సూపర్ ఫేం సంపాదించాడు కన్నడ యాక్టర్ తారక్ పొన్నప్ప. ప్రత్యేకించి పుష్ప 2లో విలన్‌గా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. ఈ చిత్రం తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అయిపోయాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నాడు. పుష్ప 2 హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటిస్తున్న మైసాలో కీ రోల్లో నటిస్తున్నాడు తారక్ పొన్నప్ప.
దీపావళి సందర్భంగా మైసా మూవీకి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశాడు. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందన్నాడు తారక్ పొన్నప్ప. రష్మిక మందన్నా సినిమాలో తారక్ పొన్నప్ప నటించడం ఇది రెండోసారి. Rawindra Pulle మైసా సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. రష్మిక మందన్నా అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తూ గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవల్లిగా డీగ్లామరస్ రోల్లో ఇరగదీసిన రష్మిక మందన్నాను మరి మైసా సినిమాలో ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Rashmika Mandanna stuns in the first still from her upcoming film #Mysaa! ✨
The buzz is real — can’t wait to see what’s next! 🔥https://t.co/ia1lJRP9zw#RashmikaMandanna #MysaaFirstLook #SouthCinema #UpcomingMovie #TrendingNow #NationalCrush #QueenOfHearts #PanIndiaFilm pic.twitter.com/6siIIji0uF— Sacnilk Entertainment (@SacnilkEntmt) October 21, 2025
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!
Ayushmann Khurrana | ‘కొత్తలోక’ను తక్కువ చేయలేదు.. ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ
Diwali 2025 | దీపావళి స్పెషల్.. టాలీవుడ్ నుంచి కొత్త సినిమా పోస్టర్లను చూశారా.!