Kotha Lokah Chapter 1 | మలయాళం నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న ‘కొత్తలోక: చాప్టర్ 1’పై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయిన విషయం తెలిసిందే. ఆయన తాజా చిత్రం ‘థామా’ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ‘కొత్తలోక’ సినిమాను ప్రస్తావిస్తూ.. ఇది కొత్తలోక కంటే బాగుంటుందని థామ రెట్టింపు ఎమోషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపాడు. దీంతో ఒక హిట్ సినిమాను తక్కువ చేశారంటూ నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదానికి ఆయుష్మాన్ క్లారిటీ ఇచ్చి తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు.
‘థామా’ ప్రమోషన్స్‌లో మాట్లాడిన ఆయుష్మాన్ ‘కొత్తలోక: చాప్టర్ 1’ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నేను ‘కొత్తలోక’కు పెద్ద అభిమానిని. ఆ చిత్రాన్ని ముంబయిలో చూసి చాలా ఎంజాయ్ చేశాను. అలహాబాద్‌లో ‘థామా’ షూటింగ్ సమయంలో ఆ సినిమా చూడాలనుకున్నా కానీ అక్కడ అందుబాటులో లేకపోవడంతో ముంబయికి వచ్చి చూశాను. ఆ చిత్రం రికార్డులు సృష్టించడం చాలా గొప్ప విషయం. ‘థామా’ అన్ని ప్రాంతాల్లో అన్ని ఆడియన్స్లకు సులభంగా అందుబాటులో ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశం. అందుకే అలా చెప్పాను. ‘కొత్తలోక’ను తక్కువ చేయడం కాదు అని ఆయుష్మాన్ స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తుంది.