Pushpa 2 The Rule | టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్ కాంబో వస్తోన్న క్రేజీ సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ చేస్తుండగా.. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మరోసారి సందడి చేయబోతున్నాడు.
షెకావత్ సార్.. ఒకటి తగ్గింది.. అంటూ పుష్ప రాజ్, షెకావత్ మధ్య డైలాగ్ వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనికి మించిన ఫీవర్ రెండో పార్టులో కూడా ఉండబోతున్నట్టు తెలియజేస్తూ.. త్వరలోనే బ్లాస్ట్ ఉండబోతుంది.. ట్రైలర్ లోడింగ్ అంటూ కొత్త పోస్టర్ షేర్ చేశారు. బన్నీ, ఫహద్ ఫాసిల్ ఫేస్ టు ఫేస్ అన్నట్టుగా ఉన్న స్టిల్ క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఈ చిత్రాన్ని 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ప్లాన్ భారీగానే ఉండగా.. బీహార్‌లోని పాట్నాలో నవంబర్ చివరలో షురూ కానుందని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. అటు నుంచి హుబ్లీ, కోచి, చెన్నైలలో ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారట. ముంబైలో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఇన్సైడ్ టాక్.
సీక్వెల్‌కు కూడా రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పనిచేస్తు్ండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. సీక్వెల్లో జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
One month to go for #Pushpa2TheRule ❤🔥
Prepare yourself – THE BIGGEST INDIAN FILM of the year is set to take the theaters by storm in a month 💥💥
TRAILER EXPLODING SOON 🌋🌋#1MonthToGoForPushpa2RAGE#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun @iamRashmika @aryasukku… pic.twitter.com/xbUOAgRWYG
— Mythri Movie Makers (@MythriOfficial) November 5, 2024
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Thalapathy 69 | బాక్సాఫీస్‌ను రూల్ చేయబోతున్న విజయ్-హెచ్ వినోథ్.. దళపతి 69 రైట్స్‌కు రికార్డ్ ధర