కర్ణాటక ప్రభుత్వం దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక అత్యున్నత పౌర పురస్కారం కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony)ను ప్రదానం చేసింది. సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో పునీత్ రాజ్‌కుమార్ సతీమణికి అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తారక్ కన్నడ భాషల్లో చక్కగా మాట్లాడి.. అందరినీ ఇంప్రెస్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఒక వ్యక్తి తన పెద్దల నుండి కుటుంబ వారసత్వం, ఇంటిపేరును పొందుతాడు. కానీ వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. అహం, అహంకారం లేకుండా తన వ్యక్తిత్వం, చిరునవ్వుతో రాష్ట్రం మొత్తాన్ని గెలుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా..? అది పునీత్ రాజ్‌కుమార్ మాత్రమేనన్నాడు.
పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక పీపుల్స్ సూపర్ స్టార్. ఆయన గొప్ప కొడుకు, గొప్ప భర్త, గొప్ప తండ్రి, గొప్ప స్నేహితుడు, నృత్యకారుడు, గాయకుడు. అన్నింటికి మించి ఆయన గొప్ప మనిషి. పునీత్ రాజ్ కుమార్ నవ్వులోని సంపద మరెక్కడా దొరకదు. అందుకే ఆయనను కింగ్ ఆఫ్ స్మైల్ అంటారు. అందుకే ఆయనకు ఈ అత్యున్నత పురస్కారం దక్కిందన్నాడు. తారక్ కన్నడ భాషలో పునీత్ గురించి మాట్లాడిన మాటల వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
#NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ
Anna kannada speach 🥵💥🔥@tarak9999 ♥️🐯 pic.twitter.com/tzlXyoFarp— Giri Naragam 😎 (@girinaragam07) November 1, 2022
Read Also : Jr NTR | బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
Read Also : HIT2 Teaser look | రావురమేశ్ లుక్‌తో శైలేష్ కొలను హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో
Read Also : Yashoda | యశోదలో సమంత యాక్షన్ సీన్లు.. యానిక్ బెన్ టీం మేకింగ్ వీడియో