HIT2 Teaser look | రావురమేశ్ లుక్‌తో శైలేష్ కొలను హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో
అడివిశేష్, శైలేష్ కొలను హిట్ 2 సినిమాతో థ్రిల్ అందించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. తాజాగా టాలెంటెడ్ యాక్టర్ రావురమేశ్కు టీంలోకి స్వాగతం పలుకుతూ.. హిట్ 2 టీజర్ అప్డేట్ అందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను.
విశ్వక్ సేన్, శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబినేషన్లో వచ్చిన చిత్రం హిట్. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు.. నిర్మాతలకు మంచి కలెక్షన్లు తెచ్చి పెట్టింది. శైలేష్ కొలను ఇపుడు హిట్ 2 (Hit2)సినిమాతో థ్రిల్ అందించేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే.
తాజాగా అడివిశేష్ లీడ్ రోల్ చేస్తున్న హిట్ 2 టీజర్ అప్డేట్ అందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. అంతేకాదు టాలెంటెడ్ యాక్టర్ రావురమేశ్కు టీంలోకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను కూడా అందరితో పంచుకున్నాడు శైలేష్ కొలను. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రావు రమేశ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశాడు. నవంబర్ 3న టీజర్ లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశాడు డైరెక్టర్.
అడివి శేష్ నటించిన పాన్ ఇండియా మేజర్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘హిట్-2’ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Introducing the ever versatile #RaoRamesh from #HIT2 as 'Nageswara Rao', ADGP of #HIT Vizag❤️🔥
Teaser out on NOV 3rd🔥
– https://t.co/Q8PguX0xw3#HIT2onDec2@AdiviSesh @NameisNani @tprashantii @Meenakshiioffl @Garrybh88 @maniDop @walpostercinema @saregamasouth pic.twitter.com/MG25Ye044a— Sailesh Kolanu (@KolanuSailesh) November 1, 2022
హిట్ 2 టీజర్ అప్డేట్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

