పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గంధద గుడి’ టీజర్.. ఫ్యాన్స్ ఎమోషనల్..

Puneeth rajkumar Gandhada gudi | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయినా కూడా ఆయన పేరు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అతనికి ఉన్న ఇమేజ్ అలాంటిది మరి. తాజాగా మరోసారి పునీత్ పేరు మార్మోగిపోతోంది. దానికి కారణం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గంధద గుడి టీజర్ విడుదల కావడమే. కర్ణాటక వన్యప్రాణి సంరక్షణ, అడవుల సురక్ష కోసం పునీత్ నటించిన వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ సినిమా ఇది. దీనికి సంబంధించిన టీజర్ డిసెంబర్ 6న విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ PRK ప్రొడక్షన్స్‌లో పునీత్ భార్య అశ్విని నిర్మించారు. అమోఘ వర్ష ఈ సినిమాను తెరకెక్కించాడు. అంతే కాదు పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ఈ సినిమాలో నటించాడు ఆయన. డిసెంబర్ 6న పునీత్ అమ్మగారు పార్వతమ్మ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా గంధద గుడి టీజర్ విడుదల చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన వస్తోంది. గంధద గుడి పునీత్ డ్రీమ్ ప్రాజెక్ట్.
సరిగ్గా ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు అంటే అక్టోబర్ 27న గంధద గుడి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. నవంబర్ 1న స్పెషల్ న్యూస్ చెబుతాను అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆయన ఎవరూ ఊహించని విధంగా గుండెపోటుతో కన్నుమూశారు. దాంతో ఈ సినిమా టీజర్ విడుదల వాయిదా పడింది. పునీత్ చనిపోయిన దాదాపు 40 రోజుల తర్వాత అతడు ఎంతో ఇష్టపడి చేసిన వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ గంధద గుడి టీజర్ విడుదల చేశారు. ఇందులో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని అడవులను అద్భుతంగా చూపించారు. ఎన్నో జంతువులు, జలపాతాల మధ్య ఈ డాక్యుమెంటరీ షూట్ చేశారు. దీనికోసం పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. తమకిష్టమైన అప్పుని మరోసారి థియేటర్లో చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి రాజ్ కుమార్ కుటుంబంలో పర్యావరణ సంరక్షణ గురించి చాలా ఆలోచిస్తారు. ఈ క్రమంలోనే పూర్తిగా అడవుల నేపథ్యంలో 1973 లోనే గంధద గుడి సినిమా చేశారు రాజ్ కుమార్. ఆ తర్వాత ఆయన పెద్దకొడుకు శివరాజ్ కుమార్ హీరోగా 1994లో దీనికి సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు పునీత్ కూడా గంధద గుడి సబ్జెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాడు. కానీ అది విడుదలయ్యే సమయానికి ఆయన లేకపోవడం అత్యంత బాధాకరం. 2022లో థియేటర్స్ లో విడుదల కానుంది ఈ డాక్యుమెంటరీ కమ్ మూవీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sirivennela | 2021లో హఠాన్మరణం చెందిన సినీ ప్రముఖులు వీళ్లే..
Puneeth rajkumar | పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం అత్యుత్తమ పురస్కారం..
Puneeth Rajkumar | పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథే
సిరివెన్నెల నెలకు ఎన్ని పాటలు రాసేవారో తెలుసా.. రెమ్యునరేషన్ ఎంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

