సిరివెన్నెల నెలకు ఎన్ని పాటలు రాసేవారో తెలుసా.. రెమ్యునరేషన్ ఎంత..?

Sirivennela seetharama sastry songs | తెలుగు ఇండస్ట్రీలో ఆత్రేయ, ఆరుద్ర తరం తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి తరం మొదలైంది. అందులో ఆద్యుడు వేటూరి అయితే ఆయన తర్వాత సిరివెన్నెల అతడి వెంట నడిచాడు. దాదాపు 35 సంవత్సరాల కెరీర్ లో 800 సినిమాలు.. 3000 పాటలు రాసి తెలుగు ఇండస్ట్రీపై ఎప్పటికీ చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఈయన తర్వాత ఇప్పుడు ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. చనిపోయే ముందు వరకు కూడా ఆయన పాటలు రాస్తూనే ఉన్నారు. ఏ ఒక్క రోజు కూడా ఖాళీగా లేరు. శాస్త్రి గారి కోసం ఎప్పుడూ దర్శక నిర్మాతలు వేచి చూస్తూనే ఉన్నారు.
కృష్ణవంశీ, శ్రీకాంత్ అడ్డాల, త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా ఇంకా చాలా మంది దర్శకులకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్థాన రచయిత. వాళ్ల సినిమాల్లో కనీసం ఆయన రెండు మూడు పాటలైనా రాయాల్సిందే. అలాంటి సిరివెన్నెల అనారోగ్యం కారణంగా కేవలం వారం రోజుల్లోనే హఠాన్మరణం చెందారు. ఈయన మరణించి వారం రోజులు దాటినా ఇప్పటికీ అతడి ఊహల్లోంచి బయటికి రాలేక పోతున్నారు దర్శక నిర్మాతలు. అభిమానులు కూడా సిరివెన్నెల పాటలు తలుచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇదిలా ఉంటే ఈయన నెలకు ఎన్ని పాటలు రాసేవారు.. ఒక్క పాటకు ఎంత పారితోషికం తీసుకునేవారు అనే విషయంపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఏ రోజు కూడా పారితోషికం కోసం పాటలు రాయలేదు సిరివెన్నెల సీతారామశాస్త్రి. సినిమా నచ్చి.. సందర్భం నచ్చి అర్థవంతమైన పాట ఇవ్వాలి అనుకుంటే ఆయన రాసేవారు.. లేదంటే లేదు. పారితోషికం కూడా అతడు ఏ రోజు ఇంత కావాలి అని అడిగిన సందర్భాలు లేవని చాలామంది నిర్మాతలు సిరివెన్నెల చనిపోయిన తర్వాత ఆ సరస్వతీ పుత్రుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎమ్మెస్ రాజు లాంటి నిర్మాతలు ఆయన రెమ్యునరేషన్ అడిగి మరీ పెంచారు. ఈ మధ్య కాలంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక్క పాట కోసం దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. నెలకు ఆయన 30 నుంచి 50 పాటల మధ్యలో రాసిన రోజులు కూడా ఉన్నాయి. గత రెండేళ్లుగా అనారోగ్యం కారణంగా నెలకు 10 నుంచి 20 పాటలకు పరిమితం అయ్యారు సిరివెన్నెల. విడుదలకు సిద్దంగా ఉన్న నాని శ్యామ్ సింగరాయ్, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలలో కూడా పాటలు రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. తమ సినిమాలను ఆయనకు అంకితం ఇచ్చారు ఆయా దర్శకులు. ఆయన లేని లోటు ఎప్పటికీ అలాగే ఉంటుందంటూ సిరివెన్నెలను స్మరించుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mohan Babu: సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరు కాని మంచు ఫ్యామిలీ.. కారణం చెప్పిన మోహన్ బాబు
Sirivennela Last wish | చివరి వరకు సిరివెన్నెలకు ఆ ఒక్క కోరిక అలాగే మిగిలిపోయింది..
సిరివెన్నెల, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?
sirivennela songs | అలాంటి పాటలను రాయలేను : సిరివెన్నెల
Sirivennela | సిరివెన్నెలకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

