Puli Meka | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ ప్రాజెక్ట్ పులి మేక (Puli Meka). కే చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌కు కోన వెంకట్ కథనందించాడు. పులి మేక సిరీస్ జీ5 (Zee5) ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆది సాయికుమార్ టీం ఈ వెబ్ ప్రాజెక్ట్‌పై క్యూరియాసిటీ పెంచుతూ.. నాని చేతుల మీదుగా లాంఛ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
పులి మేక జీ5 ప్లాట్‌ఫాంలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో పోలీస్ అధికారుల వరుస హత్యల చుట్టూ తిరిగే పులి మేక ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తున్నట్టు తాజా టాక్. పులి మేక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందని జీ5 వెల్లడించింది. ఈ వెబ్ ప్రాజెక్ట్‌లో
సుమన్, రాజా చెంబోలు, బిగ్ బాస్ ఫేం సిరి హన్మంత్, ముక్కు అవినాష్, సాయి శ్రీనివాస్, గోపరాజు రమణ ఇతరకీలక పాత్రల్లో నటించారు.
ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని పులి మేక సిరీస్‌ను జీ5లో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ లెక్కన నానితో ప్రమోషన్స్ పులి మేక సక్సెస్‌కు బాగా కలిసి వచ్చినట్టేనంటున్నారు సినీ జనాలు. రానా దగ్గుబాటి రేపు ఉదయం 11 గంటలకు పులిమేకలోని ఫోరెన్సిక్ అంశాల గురించి వివరించేందుకు రెడీగా ఉన్నారంటూ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
https://twitter.com/ZEE5Telugu/status/1629766462809464832
https://twitter.com/ZEE5Telugu/status/1629858331836960768
Read Also :
VD12 | క్రేజీ టాక్.. హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌కే VD12లో మరో ఛాన్స్..?
SSMB 28 | మహేశ్‌బాబుతో వన్స్‌మోర్.. ఎస్ఎస్ఎంబీ 28లో టాలెంటెడ్ యాక్టర్..!
Mahesh babu | సూపర్ యంగ్ లుక్‌లో మహేశ్ బాబు.. యాడ్ వీడియో వైరల్
Anikha Surendran | ఈ సారి కొంచెం హాట్‌గా.. అనిఖా సురేంద్రన్ ప్రమోషన్స్ స్టిల్స్ వైరల్