Anikha Surendran | అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసింది. ఆ తర్వాత తెలుగులో ది ఘోస్ట్ సినిమాలో కీలక పాత్రలో నటించింది కేరళ కుట్టి అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఈ ఏడాది బుట్ట బొమ్మ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు మొదటిసారి హాయ్ చెప్పింది. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ నటించిన చిత్రాల్లో ఒకటి ఓ మై డార్లింగ్. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం కొంచెం హాట్‌గా దర్శనమిచ్చింది. స్టన్నింగ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ చేయబడి ఉన్న స్లీవ్ గౌన్‌లో అందాలు ఆరబోస్తూ.. చిరునవ్వులు చిందించింది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. జాన్ ఆంటోనీ, డైన్ డెవిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్ ఫీ మేల్ లీడ్ పోషించింది.
అనిఖా సురేంద్రన్ ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తుండగా.. తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తోంది. ఈ భామ కోసం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు క్యూలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
అనిఖా సురేంద్రన్ స్టిల్స్..
Anikha Surendran | చిన్నగౌను వేసుకున్న పెద్ద పాప.. ట్రెండింగ్‌లో అనిఖా సురేంద్రన్ స్టిల్స్
Virupaksha | విరూపాక్షలో సాయిధరమ్ తేజ్ రిస్కీ బైక్ స్టంట్.. గ్లింప్స్ వీడియో
Rao Ramesh | గెట్ రెడీ.. హీరోగా రావురమేశ్.. సినిమా వివరాలివే
RRR | ‘నాటు నాటు’ పాటకు పాక్ నటి డ్యాన్స్.. వీడియో వైరల్..!