Anikha Surendran | చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టి.. పద్దెనిమిదేండ్ల ప్రాయంలోనే సోలో హీరోయిన్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కేరళ కుట్టి అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). ఇటీవలే బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఓ వైపు సంప్రదాయక వస్త్రధారణలో కనిపిస్తూనే.. మరోవైపు ట్రెండీ దుస్తుల్లో మెరిసిపోతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది అనిఖా సురేంద్రన్. తాజాగా ఈ భామ వైట్ అండ్ వైట్ గౌనులో హొయలుపోతూ.. చిన్నగౌను వేసుకున్న పెద్ద పాప.. నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప.. అంటూ సాగే పాటను గుర్తు చేస్తోంది. అనిఖా సురేంద్రన్ స్టిల్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మీరు కొన్ని ఫొటోల్లో నయనతారలా కనిపిస్తున్నారు.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. నా ప్రేమను అందుకో అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు. ఎంత క్యూట్‌గా ఉన్నావోనంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. తెలుపు రంగు దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ స్టిల్స్ కుర్రకారుకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్నాయి. అనిఖా సురేంద్రన్ ప్రస్తుతం మలయాళంలో రెండు, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది.
వైట్ అండ్ వైట్ లుక్‌లో అనిఖా సురేంద్రన్..
❤️❤️#Anikha #Trending pic.twitter.com/nK6zub0Yz8
— Anikha surendran (@Anikha_S_online) February 17, 2023
Ugram teaser | అల్లరి నరేశ్ ఈజ్ బ్యాక్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న ఉగ్రం టీజర్
Dasara | నాని బర్త్ డే స్పెషల్.. సరికొత్తగా దసరా ప్రమోషన్స్ ప్లాన్
Prabhas | బ్యాక్ టు షూట్.. మారుతి సినిమాకు ప్రభాస్ నయా డేట్స్