VD12 | క్రేజీ టాక్.. హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌కే VD12లో మరో ఛాన్స్..?
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఈ ఏడాది జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కొత్త ప్రాజెక్ట్ (VD12) ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.ట.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కొత్త ప్రాజెక్ట్ (VD12) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)ను మరోసారి తన సినిమాలోకి తీసుకోవాలని గౌతమ్ తిన్ననూరి ప్లాన్ చేస్తున్నాడట. గౌతమ్ తిన్ననూరి మొదటి సినిమా జెర్సీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు రెండోసారి విజయ్ దేవరకొండ సినిమాకు అనిరుధ్ దాదాఫు ఫిక్సయినట్టు టాక్ నడుస్తోంది. అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
రజినీకాంత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న జైలర్‌కు, విజయ్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న లియో చిత్రానికి, శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇండియన్ సినిమాతోపాటు ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. మరి ఇంత బిజీగా ఉన్న అనిరుధ్ VD12కి టైం ఇస్తాడా..? లేదా..? అన్నది చూడాలి. కాప్ స్టోరీతో తెరకెక్కుతున్న VD12 చిత్రంలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం భాగస్వామ్యం కాబోతుంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివనిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి మరోవైపు రాంచరణ్‌తో కూడా సినిమాను ప్రకటించేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

