SSMB28 Movie | ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు మహేష్ బాబు. ప్రస్తుతం అదే జోష్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బెస్ట్ కాంబోలో వీళ్ళది ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి టీఆర్పీను సొంతం చేసుకుంటాయి. ఇక దాదాపు 12ఏళ్ళ తర్వాత వీళ్ళ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాగా ఇటీవలే మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి చనిపోవడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చాడు.
ఈ క్రమంలో గత రెండు, మూడు రోజుల నుండి ఈ సినిమా కాన్సిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా నిర్మాత సూర్యవంశీ ఈ వార్తలకు చెక్ పెట్టాడు. ‘SSMB28’ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎగ్జ్జైటింగ్ అప్డేట్లు రానున్నట్లు వెల్లిడించాడు. ఈ ట్వీట్‌తో సినిమా కాన్సిల్ కాలేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది.
The second schedule of our most awaited action extravaganza #SSMB28 will begin soon. Many more exciting updates will be unveiled in upcoming days. Stay tuned!
— Naga Vamsi (@vamsi84) October 31, 2022
Read Also:
Balakrishna | ఆ స్టార్ డైరెక్టర్ బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశాడట..!
Adipurush Movie | ‘ఆదిపురుష్’ మూవీ పోస్ట్ పోన్ కానుందా?
Chiranjeevi | ‘వాల్తేరు వీరయ్య’ లుక్‌ను రీ క్రియేట్ చేసిన 4వేల మంది విద్యార్థులు.. వీడియో వైరల్
‘NTR30’ క్రేజీ అప్డేట్.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..!