NTR-Koratala siva Movie | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ చిత్రంలో తారక్ నటనకు కేవలం గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా వచ్చి ఆరు నెలలు దాటింది. ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివతో రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక మరోసారి వీరిద్దరు కలిసి చేయనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు చిత్రబృందం రిలీజ్ చేసిన డైలాగ్ వీడియో సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా కాన్సిల్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర పీఆర్ఓ ఇచ్చిన అప్డేట్తో ఆ వార్తలకు చెక్ పడింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ప్రీ ప్రొడక్షన్ పనులను మరింత వేగ వంతం చేశారని తెలిపాడు. ఈ ట్వీట్‌తో రూమర్స్‌కు చెక్ పెడుతూ నందమూరి అభిమానుల్లో జోష్ నింపాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుందట. అనురుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం.
#NTR30 Update
Director Koratala Siva, DOP Ratnavelu and Production Designer Sabu Cyril have ramped up pre-production on a massive scale. Movie to hit the floors very soon.
— Vamsi Kaka (@vamsikaka) October 31, 2022