Adipurush | పాన్ వరల్డ్ సినిమాగా ‘ఆదిపురుష్’.. ఇంటర్నేషనల్ స్టూడీయోస్‌తో మేకర్స్ టైఅప్!
Adipurush | ‘బాహుబలి’తో ప్రభాస్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. ప్రభాస్‌తో సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్లలో బడ్జెట్‌ను లెక్కలు వేసుకుని మరి దర్శక, నిర్మాతలు కథ చెప్పడానికి వస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్ని వందల కోట్లలో బిజినెస్‌లు చేస్తున్నాయి. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కూడా భారీ బిజినెస్‌లు జరిగినవే. ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయిన కానీ ప్రభాస్ ఇమేజ్ మాత్రం ఇసుమంత తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఈ నాలుగు సినిమాలన్ని కలుపుకుని దాదాపు రూ.2000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని సినీ విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలోనే ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ బడ్జెట్‌పై నిర్మాత స్పందించాడు.
‘ఆదిపురుష్’ చిత్రాన్ని రూ.500 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తాజాగా నిర్మాత భూషన్ కుమార్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు.. ఇంగ్లీష్ డబ్బింగ్ కోసం ఇంటర్నేషనల్ స్టూడీయోస్‌తో టై అప్ అవుతున్నట్లు తెలిపాడు. మైథలాజికల్ నేపథ్యంలో రామాయణం ఆధారంగా ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ గడిచి నెలలు దాటిన ఇప్పటివరకు ఫస్ట్‌లుక్ గాని ఇతర ప్రచార చిత్రాలుగాని విడుదల కాలేదు. ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమికి ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తారిని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. కానీ చివరికి ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో ఓ వీడియోను విడుదల చేసింది.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ ఫస్ట్‌లుక్ పోస్టర్ డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదల కానున్నట్లు సమాచారం. దానికి ఇంకా సమయం ఉన్నా కానీ ఈ వార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త ఊరటనిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న దాదాపు 15 భాషల్లో విడుదల కానుంది.
"#Adipurush is a PAN world movie, we are dubbing it in English & also we are tying up with big International studios" – Bhushan Kumar#Prabhas
— Manobala Vijayabalan (@ManobalaV) June 2, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

