Priyanka Chopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన పీసీ.. 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్ (Nick Jonas)ను వివాహం చేసుకొని లాస్ఏంజెల్స్లో సెటిల్ అయిపోయింది. అయితే, వీరి వివాహంపై సోషల్ మీడియాలో అనేక ట్రోలింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ (10 Year Age Gap) గురించి నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రియాంక తల్లి మధు చోప్రా (Madhu Chopra) తాజాగా స్పందించారు. ఏజ్ అనేది కేవలం సంఖ్యమాత్రమే అని అన్నారు. హృదయాలు, మనసులు కలవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ‘ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే. దాన్ని కొందరు వ్యక్తులు సమస్యగా సృష్టిస్తున్నారు. ఇక్కడ హృదయాలు, మనసులు కలవడం చాలా ముఖ్యం’ అని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్ (Hollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) నిక్ జొనాస్ (Nick Jonas)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.
ఇక మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఖరారైన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రాకు రూ.30కోట్ల భారీ పారితోషికం అందించనున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ జరుగుతున్నది.
Also Read..
Ranya Rao | నటి రన్యారావు ఇంట్లోనూ అధికారుల సోదాలు.. భారీగా బంగారం, నగదు పట్టివేత
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Singer Kalpana Daughter | మా అమ్మ సూసైడ్ చేసుకోలేదు : కల్పన కూతురు