Singer Kalpana Suicide | ప్రముఖ సింగర్ కల్పనా రాఘవేందర్ (Kalpana Raghavendar) ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వస్తున్న వార్తలను ఆమె కూతురు తాజాగా ఖండించింది. కల్పన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెను చూడడానికి కేరళ నుంచి వచ్చిన ఆమె కూతురు కల్పనను కలిసిన అనంతరం సంచలన విషయాలను వెల్లడించింది. అసలు తన తల్లి సూసైడే చేసుకోలేదంటూ కల్పన కూతురు వెల్లడించింది.
మా అమ్మ సూసైడ్ చేసుకోలేదు. ఆమె తీసుకునే నిద్రమాత్రలు ఓవర్డోస్ వలనే ఇలా అయ్యిందని కల్పన కూతురు తెలిపింది. డాక్టర్స్ సూచన మేరకు ప్రస్తుతం జోల్ ఫ్రెష్ మాత్రలు తీసుకుంటుంది. మా ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవు. మా అమ్మ నాన్న సంతోషంగా జీవిస్తున్నారు. నేను కూడా వారితో సంతోషంగానే ఉన్నాను. అమ్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. త్వరలోనే ఆమె మీ ముందుకు మళ్లీ వస్తుందంటూ చెప్పుకోచ్చింది.
అసలు ఏం జరిగిందంటే..
సింగర్ కల్పనా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మంగళవారం సాయంత్ర వార్తలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్లోని నిజాంపేటలో నివాసం ఉంటున్న కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిన్న కేరళ నుంచి కల్పన హైదరాబాద్కి రాగా.. నిజాంపేటలో ఉన్న నివాసంలో తన కూతురితో ఫోన్ మాట్లాడుతూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. తన కూతురిని హైదరాబాద్కి రమ్మని కోరగా.. ఆమె తిరస్కరించడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కల్పన సుసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మోతాదుకు మించి ట్యాబెట్లు వేసుకోవడంతో కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లగా… సాయంత్రం 5:00 గంటల సమయంలో ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేసినప్పుడు కల్పన స్పందించలేదు. దీంతో ఆయన విల్లా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విల్లా సెక్రటరీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన వెంటనే కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే కల్పన సుసైడ్ చేసుకుందన్న వార్తలను తన కూతురు తాజాగా ఖండించింది.
Also Read..