priyanka chopra engagement ring| నిశ్చితార్థం సందర్భంగా ఉంగరాల్ని బహుమతిగా ఇచ్చిపుచ్చుకోవడం సాధారణమే. సదరు ఆభరణాల్ని దంపతులిద్దరూ జీవితాంతం మధురజ్ఞాపకంగా భద్రపరచుకుంటారు. గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా కు మాత్రం ఎంగేజ్మెంట్ రింగ్‌తో అంతకుమించిన భావోద్వేగపూరిత బంధం ఉందట.
పాప్ గాయకుడు నిక్‌జోనాస్‌ను పెళ్లాడిన ఈ భామ ప్రస్తుతం ఆమెరికాలోనే స్థిరపడిపోయిన విషయం తెలిసిందే. అక్కడ నుంచే హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నది. తన నిశ్చితార్థపు ఉంగరం గురించి ప్రియాంక చోప్రా ఇటీవల ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. అది కేవలం ఓ అద్భుతమైన జ్ఞాపకం మాత్రమే కాదని, తనను ముందుకు నడిపించే శక్తిగా అభివర్ణించింది. ‘ఉంగరం విలువ గురించి నేనెప్పుడు ఆలోచించలేదు.. దానితో ఎన్నో మధురజ్ఞాపకాలు పెనవేసుకుపోయి ఉన్నాయి. మా ఇద్దరి ఉన్నతిలో అదొక సెంటిమెంట్ కానుకగా భావిస్తాను’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. దాదాపు రెండుకోట్ల విలువ చేసే ఈ ఉంగరాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆభరణాల సంస్థ నుంచి ఖరీదు చేశారు. ఈ ఎంగేజ్మెంట్ రింగ్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ప్రియాంకచోప్రా అనేక సందర్భాల్లో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Priyanka chopra | పదో తరగతిలోనే ఫస్ట్ లవ్.. ఆ టైంలో నా బాయ్‌ఫ్రెండ్‌ను బీరువాలో దాచిపెట్టా..
Priyanka Chopra | నెటిజన్లను ఆకర్షిస్తున్న ప్రియాంక చోప్రా..
Priyanka Chopra: కైపెక్కించే అందాలతో కేక పెట్టిస్తున్న ప్రియాంక చోప్రా
Priyanka Chopra: ఇదేం అరాచకం ప్రియాంక.. పిక్ చూసి షాకవుతున్న ఫ్యాన్స్
సౌత్‌లో ప్లాప్.. బాలీవుడ్లో మాత్రం సూపర్‌హిట్టు
కోహ్లి ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు ఎంత వసూలు చేస్తాడో తెలుసా?