కోహ్లి ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు ఎంత వసూలు చేస్తాడో తెలుసా?

న్యూఢిల్లీ: ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే చాలు.. వాళ్లు సంపాదించే మార్గాలు కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, సినిమా తారలు కావచ్చు.. ఈ సోషల్ మీడియా యుగంలో వారికి తమ అభిమానులే పెట్టుబడి. ఎంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే అంత ఎక్కువ సంపాదించవచ్చు. వీళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చేసే పోస్ట్‌లతో కూడా భారీగా సంపాదిస్తారని ఎంత మందికి తెలుసు? తాజాగా హాపర్‌హెచ్‌క్యూ 2021 ఇన్స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అత్యధిక మొత్తం అందుకునే సెలబ్రిటీల లిస్ట్ ఇది.
రొనాల్డో టాప్
మన వరకూ ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి సంపాదనే చాలా ఎక్కువ అనుకుంటాం కానీ.. ఫుట్బాలర్లతో పోలిస్తే విరాట్‌లాంటి వాళ్ల సంపాదన చాలా చాలా తక్కువ. ఈ పోస్ట్‌ల విషయంలోనూ అదే జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో పోస్ట్‌కు రూ.11 కోట్లు వసూలు చేస్తాడట. ఇతనితో సమానంగా డబ్ల్యూడబ్ల్యూఈ, హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ కూడా అంతే మొత్తం తీసుకుంటుండటం విశేషం.
ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లి 19వ స్థానంలో ఉన్నాడు. ఇండియాలో అత్యధిక మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న విరాట్.. ఒక్కో పోస్ట్‌కు రూ.5 కోట్లు వసూలు చేస్తాడని హాపర్‌హెచ్‌క్యూ వెల్లడించింది. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ అతడే. అతని తర్వాత ప్రియాంకా చోప్రా రూ.3 కోట్లతో 27వ స్థానంలో ఉంది. మొత్తం 395 మంది సెలబ్రిటీలు ఉన్న లిస్ట్‌లో ఏ ఇతర ఇండియన్ క్రికెటర్ లేడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

