గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కన్నా పదేళ్లు చిన్న వాడైన నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రైవేట్ లైఫ్‌ని తెగ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ప్రియాంక సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ షూటింగ్ కోసం ఆమె లండన్లోఉంటుంది. అప్పుడప్పుడు లాస్ ఏంజెల్స్‌కి వస్తుంది.
తన భర్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రియాంక చోప్రా తన రొమాంటిక్ యాంగిల్ చూపిస్తూ కేక పెట్టిస్తుంది. ఇప్పటికే ఎన్నోసార్లు పబ్లిక్ ప్లేస్ లోనే రొమాంటిక్ మూడ్ ఎంజాయ్ చేస్తూ హంగామా చేసిన ఈ జంట తాజాగా బీచ్ ఒడ్డున రెచ్చిపోయారు. ప్రియాంక బికినీలో కనిపించగా, ఆమె భర్త నిక్ జోనాస్ స్నాక్‌లా ప్రియాంక ప్రైవేట్ పార్ట్‌ని తినేందుకు సిద్ధమవుతున్నాడనేలా కామెంట్ పెట్టింది. ఇది చూసి ఇదేం అరాచకం ప్రియాంక అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్గా ప్రియాంక తన ఫేస్ నిండా రక్తపు మరకలు ఉన్న ఫొటోలు షేర్ చేసింది. రక్తమంతా మేకప్‌లోనే భాగమని తెలిపిన ప్రియాంక.. ఈ ఫొటోలో రియల్ గాయం ఏది.? కానిది ఏది అంటూ పోస్ట్ చేసింది. షూటింగ్లో భాగంగా ప్రియాంక కనుబొమ్మపై చిన్న గాటు పడగా అది ఎలా జరిగిందని నెటిజన్స్ తెగ కామెంట్స్ చేశారు.