AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కేంద్రానికి సమీపంలోగల ఉప్పాడ చేపల మార్కెట్లో సోమవారం విలస చేపలు సందడి చేశాయి. అత్యంత అరుదుగా లభించే ఈ చేపలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడ్డారు. దాంతో కిలో, కిలోన్నర బరువున్న ఒక్కోచేప రూ.1000 నుంచి రూ.1500 వరకు ధర పలికింది.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కేంద్రానికి సమీపంలోగల ఉప్పాడ చేపల మార్కెట్లో సోమవారం విలస చేపలు సందడి చేశాయి. అత్యంత అరుదుగా లభించే ఈ చేపలను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు పోటీపడ్డారు. దాంతో కిలో, కిలోన్నర బరువున్న ఒక్కోచేప రూ.1000 నుంచి రూ.1500 వరకు ధర పలికింది. మాకు పలస గురించి తెలుసుగానీ ఈ విలస ఏంది అనుకుంటున్నారా..? సముద్రంలో ఉన్నప్పుడు విలసగా పిలువబడే ఈ చేపలే.. సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలో ఎదురీదుతూ పైకి వచ్చినప్పుడు పులసలుగా మారుతాయి.
విలసగా ఉన్నప్పుడు కిలో రూ.1000 పలికే ఈ చేప ధర పులసగా మారిన తర్వాత రూ.20 వేల వరకు పలుకుతుంది. ఎందుకంటే విలసలే ఎంతో రుచిగా ఉంటాయంటే.. పులస చేపల రుచి అంతకంటే ఎన్నో రెట్లు రుచికరంగా ఉంటుంది. పులస రుచి గురించి తెలిసిన వాళ్లు అత్యంత అరుదుగా లభించే ఈ చేపను కొనుగోలు చేయడం కోసం డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించరు. అయితే కొంతమంది విలస అన్నా, పులస అన్నా ఒకటే అని పొరపాటు పడుతుంటారు. కానీ విలస వేరు, పులస వేరు అని మత్స్యకారులు చెబుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
Trivikram | ప్రభాస్‌లో ఆ యాంగిల్‌ను ఎవరూ చూపించలేదు.. త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

