బాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలలో నటించి అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ ‘ది మ్యాట్రిక్స్: ది రిసరక్షన్స్’ అనే హాలీవుడ్ మూవీలు చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ప్రియాంక చోప్రా అప్పుడప్పుడు అదిరిపోయే ఫొటోలు షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంటుంది.ప్రియాంక స్పెషల్ ఈవెంట్లకు ధరించే దుస్తులు, బికినీ ట్రీట్లు మామూలుగా ఉండవు.
తాజాగా స్పెయిన్లో ఉన్న ఈ అమ్మడు బికినీలో రచ్చ చేసింది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్లో భాగంగా స్పెయిన్లో ఉండగా, అక్కడ కోస్టార్స్తో సందడి చేసింది. బోలు రైడ్ చేసి వావ్ అనిపించింది. బికినీలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి చూసిన ఫ్యాన్స్ మతులు పోతున్నాయి. ప్రియాంక భర్త నిక్ జోనాస్ కూడా అమ్మడి అందాలకు ముగ్దుడయ్యాడు. డామిన్ గార్ల్ అంటూ కామెంట్ సెక్షన్లో రాసాడు.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనస్ 2018లో వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
https://www.instagram.com/p/CUsSTwTDMqG/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/reel/CUsU3uoDngE/?utm_source=ig_web_copy_link