Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Vehicle Mafia | కార్లు, బైకులు తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ సోష ల్‌మీడియాలో ప్రకటనలు ఇచ్చి వాటి ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వాటికి స్పందించిన వారిని వాయిదాలు చెల్లించని వాహన యజమాని వద్దకు తీసుకెళ్తారు.
Vehicle Mafia | చాంద్రాయణగుట్టకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ఫైనాన్షియర్ దగ్గర రూ.లక్ష రుణం తీసుకుని బైక్ కొనుగోలు చేశారు. మొదట రెండు నెలలు సక్రమంగా వాయిదాలు చెల్లించాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో ఏజెంట్లు వచ్చి బకాయిలు చెల్లించకుంటే తాము సూచించిన వ్యక్తికి వాహనం అమ్మాలని ఒత్తిడి చేశారు. దీంతో గత్యంతరం లేక అతను ఆ వాహనాన్ని వారికి అమ్మేశాడు. ఆ తర్వాత ఫైనాన్షియర్ నుంచి ఒత్తిళ్లు అలాగే ఉండటం, వాహనం లేకపోవడంతో రెండుచోట్ల మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
పాతబస్తీ పరిధిలో తన వాహనం చోరీకి గురైనట్లు గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఒక కొత్తకోణం వెలుగు చూసింది. ఒక ప్రైవేటు ఫైనాన్సియర్ ఆ వాహనాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయించి, బీమా సొమ్ము కోసం దొంగాట ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఫైనాన్షి యర్ నుంచి రుణం తీసుకున్న వ్యక్తులు, చెల్లింపుల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బైకు మీది.. రుణం మీది.. మళ్లీ బైకు మాదే.. కానీ రుణం మాత్రం మీదేనంటూ మహానగరంలో బైకుల మాఫియా తయారైంది. బాధితుల ఆశలను ఆసరాగా చేసుకుని వారికి రుణాలు ఇప్పించడానికి అవసరమైన పత్రాలు తీసుకుని ఆ తర్వాత రుణాలు ఇప్పించి వాయిదాలు కట్టని పరిస్థితుల్లో వారి నుంచి వాహనం తీసుకుని అటు ఫైనాన్స్ సంస్థకు ఇవ్వ కుండా నేరుగా సెకండ్ హ్యాండ్ అమ్ముకుని సొమ్ము చేసు కుంటున్న ఘటనలు ఇటీవల నగరంలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. కేవలం ఈ ఎనిమిదినెలల్లో ఇటువంటి కేసులు సుమారు ఇరవైకి పైగా నమోదైనట్లు పోలీసులు చెప్పారు. ఇవి ఎక్కువగా పాతబస్తీ ప్రాంతంలో జరుగుతు న్నట్లుగా గుర్తించామని వారు పేర్కొన్నారు. నగరంలో కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి రుణం ఇప్పిస్తానని డబ్బులు కట్టకపోవడంతోనే.. ఆశచూపి వ్యక్తిగత డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు. ఆయా వ్యక్తుల పేరిట బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల సిబ్బంది సహ కారంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. వాటిని అద్దెకిచ్చి తామే వాయిదాలు చెల్లిస్తామని చెప్పి నమ్మి స్తున్నారు. రెండు మూడు నెలలు ఈ వ్యవహారం సాఫీగానే సాగినా ఆ తర్వాత అసలు దందా మొదలవుతోంది. వాహనాలను తక్కువ ధరకు ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకుం టున్నారు. గతంలో ఈ తరహా మోసాలకు పాల్పడిన ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 30వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో పెద్ద ఎత్తున అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు కొనేందుకు రుణాలు తీసుకుని సక్రమంగా వాయిదాలు చెల్లించని వారిని ఏజెంట్లు భయపెట్టి వాహనాలు తీసుకెళ్లడం సహజంగా జరు గుతుంది. నిబంధన ప్రకారం వాటిని ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలకు అప్పగించాల్సి ఉండగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. బకాయిలు రద్దు చేయిస్తామంటూ వాహన యజమానులతో బండి చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కేసు నమోదయ్యాక బీమా సంస్థలకు దరఖాస్తు చేసి సొమ్ములు కొట్టేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. వాహ నాల రుణం తీసుకుని వాయిదాలు సరిగా చెల్లించని వారిని లక్ష్యంగా చేసుకుని ఏజెంట్లు మోసానికి పాల్పడుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రకటనలు
కార్లు, బైకులు తక్కువ ధరకు ఇప్పిస్తామంటూ సోష ల్‌మీడియాలో ప్రకటనలు ఇచ్చి వాటి ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వాటికి స్పందించిన వారిని వాయిదాలు చెల్లించని వాహన యజమాని వద్దకు తీసుకెళ్తారు. వీరికి ఆ వాహనాలు అమ్మితే కేసులు, వాయిదాలు చెల్లించకుండా వదిలేస్తామంటూ భరోసా ఇస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా లేని బాధితులు ఏజెంట్ల మాటలు నమ్మి వాహనతాళాలు వారికి అప్పగిస్తారు. నగదు చేతికి అందిన తర్వాత ఏజెంట్లు ముఖం చాటే స్తున్నారని, దీంతో చాలా మంది బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించినా పోలీసులను ఆశ్రయిస్తే మరిన్ని కేసులు అవుతాయేమోనని భయపడి బయ టకు రావడం లేదని ఒక పోలీసు అధికారి చెప్పారు. ఒకవైపు వాహనాలు లేక, మరోవైపు ఫైనాన్స్ సంస్థల నుంచి వచ్చే నోటీసులు తీసుకుంటూ తాము రెండు విధాలుగా మోసపోయినట్లని బాధితులు కొందరు పోలీసులకు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vehicle Mafia | వాహనాలు కొనిపించి.. అమ్మించి.. హైదరాబాద్‌లో వెహికల్ మాఫియా నయా దందా
Brazil President | నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ట్రంప్ వ్యతిరేకి లూలా డ సిల్వా.. ప్లావియో బోల్సోనారోపై ఘన విజయం..!
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై గందరగోళం.. నాగవంశీ పోస్ట్‌తో కన్ఫ్యూజన్!
Vishwak Sen | విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్లో గందరగోళం.. అభిమానులకు క్షమాపణలు చెప్పినా తగ్గని విమర్శలు!
Arjun | హీరో అర్జున్ ఇంట పెళ్లి సందడి.. 14 ఏళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

