Saripodhaa Sanivaaram | న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని 31గా తెరకెక్కుతోంది. గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి మేకర్స్ లాంచ్ చేసిన ఫస్ట్ లుక్‌తోపాటు ప్రియాంక అరుళ్ మోహన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియాంక ఆరుళ్ మోహన్ ఇందులో కానిస్టేబుల్ చారులతగా నటిస్తోంది.
ఈ భామ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అందరితో షేర్ చేసుకుంది. ప్రియాంక అరుళ్ మోహన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోగా.. ఈ స్టిల్, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుండగా.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఆయా భాషల్లో గరం గరం సాంగ్‌ను విడుదల చేయగా.. మంచి స్పందన వస్తోంది. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#PriyankaMohan Has Started Her Dubbing 🎙️ for #SaripodhaaSanivaaram 🥳@priyankaamohan pic.twitter.com/U8rQE4tEBA
— Sekar 𝕏 (@itzSekar) July 7, 2024
Bad Newz | నెట్టింట సెగలు రేపుతున్న తృప్తి డిమ్రి.. విక్కీ కౌశల్ Bad Newz సాంగ్ ప్రోమో వైరల్
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?