Karwa Chauth | నిన్న కర్వాచౌత్ (Karwa Chauth).. జీవిత భాగస్వామి క్షేమాన్ని కాంక్షిస్తూ మహిళలు కర్వాచౌత్ (Karwa Chauth) వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారన్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం చేసుకుంటారు. జల్లెడలో ముందుగా చంద్రుడిని చూసి ఆ తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు. భర్త ఆశీర్వాదాల అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు.
తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ స్టార్ జంటలు ప్రియాంక చోప్రా (Priyanka Chopra)-నిక్ జొనాస్, ఆయుష్మాన్ ఖురానా-తాహిరా కశ్యప్, రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ, విక్రాంత్ మాస్సే-శీతల్, పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా, మౌనీరాయ్, శిల్పాశెట్టి, మీరా కపూర్, రవీనా టాండన్ తదితులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి అమ్మవారికి పూజ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్గా మారాయి.
Also Read..
Priyanka arul mohan | ఫేక్ ఫోటోలపై ఓజీ హీరోయిన్ సీరియస్.. ఏఐని చెత్త పనుల కోసం వాడొద్దన్న నటి
Atlee | AA22xA6 మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అట్లీ.. కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు..