Atlee |పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతని కొత్త చిత్రం “AA22xA6” ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీలక పాత్రలలో మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వి కపూర్ లాంటి ప్రముఖ హీరోయిన్స్ కూడా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే రీసెంట్గా బెంగళూరులో జరిగిన పికిల్‌బాల్ టోర్నమెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు అట్లీ.
ఈ క్రమంలో అట్లీ మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ బాగానే సాగుతోందని తెలిపారు. “ఈ సినిమా సాధారణ సినిమాల్లా కాదు. ఈ జానర్‌కు ప్రత్యేకమైన మార్గదర్శకాలు లేవు కనుక మేమే దారి సృష్టిస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం” అని ఆయన చెప్పారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో రిస్క్ చేస్తున్నారా అని అడిగితే అట్లీ మాట్లాడుతూ.. ఇది నాకు రిస్క్ కాదు, నేను ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా కొత్తదనంగా ఉంటుంది, ప్రేక్షకుల చూసే విధానాన్ని మారుస్తుంది. వాళ్లను ఆకర్షించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నాం” అని స్పష్టం చేశారు.
సాంకేతికంగా అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ, అద్భుతమైన విజువల్స్ తో సినిమాను రూపొందిస్తున్నట్లు అట్లీ పేర్కొన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త ప్రపంచాన్ని తెరపై చూపించే అవకాశం ఉన్న ఈ “AA22xA6” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కొన్ని నెలల్లో మరిన్ని అప్డేట్లు వెలువడనుండగా, టీజర్ కూడా త్వరలో విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.