Sarangapani Jathakam | టాలీవుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, బలగం నటుడు ప్రియదర్శి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్, ‘సమ్మోహనం, చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ కాంబినేషన్ ఈ సినిమాను నిర్మించబోతుండగా.. రూప కొడువాయూర్ కథానాయికగా నటిస్తుంది. నేడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ సినిమాకు సారంగపాణి జాతకం (SarangapaniJathakam) అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనితో పాటు ప్రియదర్శికి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రియదర్శిని చూస్తుంటే జాతకాలు చెప్పే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శ్రీదేవి మూవీస్ సంస్థలో రూపొందుతోన్న ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అనగనగా… ఓ అదృష్ట రేఖ 🤩
అదిగో మా సారంగపాణి 🖐😃Here’s the FIRST LOOK of jam-packed comedy ride #SarangapaniJathakam 🖐🏻@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN pic.twitter.com/jLuSky9QXn
— Vamsi Kaka (@vamsikaka) August 25, 2024
ఈ సినిమాలో వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Also read..