Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో రెండు పతకాలు (Medals) సాధించిన భారత షూటర్ (Indian Shooter) మనూ భాకర్ (Manu Bhaker) ఇవాళ తన అమ్మమ్మ వాళ్ల ఊరైన ఖాన్పూర్ కుర్ద్ (Khanpur Khurd) కు వెళ్లింది. తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన మనూభాకర్‌కు ఖాన్పూర్ కుర్ద్ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూలదండలు వేసి సన్మానించారు. పెద్దవాళ్లు ఆశీర్వచనాలు అందజేశారు.
ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మనూభాకర్ ఏకంగా రెండు కాంస్య పతకాలను సాధించారు. ఒకటి షూటింగ్ సింగిల్ ఈవెంట్లో రాగా, మరొకటి మరో షూటర్ సరబ్జీత్ సింగ్‌తో కలిసి మిక్స్డ్ ఈవెంట్లో సాధించింది. దాంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మనూభాకర్ నిలిచింది. దాంతో మనూ భాకర్‌కు దేశమంతా నీరాజనం పడుతోంది.
ఈ సందర్భంగా మనూభాకర్ తండ్రి మాట్లాడుతూ.. ఖాన్పూర్ కుర్ద్ గ్రామ ప్రజలు తన కుమార్తెపట్ల చూపించిన ప్రేమాభిమానాలు చాలా గొప్పవని, వాటిని తానెప్పటికీ మరువబోనని అన్నారు. తన కూతురు సాధించిన దానికి యావత్ దేశమే ప్రశంసలు కురిపిస్తుండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
#WATCH | Jhajjar, Haryana: Indian Shooter & double Olympic medalist Manu Bhaker receives a grand welcome on her arrival at her maternal grandparent’s residence in Khanpur Khurd. pic.twitter.com/nqqmlFnpIO
— ANI (@ANI) August 25, 2024
#WATCH | Jhajjar, Haryana: Indian Shooter and double Olympic medalist Manu Bhaker’s father Ram Kishan Bhaker says, “I am extremely grateful for the love of the people. The people of the village have given a lot of love to us…I respect all of them. The whole country is proud of… https://t.co/mRJEk7V5M6 pic.twitter.com/YHu9TpQfyU
— ANI (@ANI) August 25, 2024