హైదరాబాద్: 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు తమకు అవకాశం కల్పించాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి బహుమతులు అందేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2036లో ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. విశ్వక్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో స్టేడియాలను నిర్మిస్తామని, వసతులు కల్పిస్తామని చెప్పానన్నారు. దానికోసం ఇప్పటి నుంచి ప్రణాళికా బద్ధంగా పనిచేస్తామని చెప్పినట్లు వెల్లడించారు.
తెలంగాణలో 2036 సంవత్సరంలో ఒలంపిక్స్ నిర్వహిస్తాం – రేవంత్ రెడ్డి pic.twitter.com/1l0PDuSTKQ
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2024