e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News ట్రెండ్ మార్చేసిన ప్రియదర్శి.. ఇట్స్ సీరియస్ అంటున్న కమెడియన్

ట్రెండ్ మార్చేసిన ప్రియదర్శి.. ఇట్స్ సీరియస్ అంటున్న కమెడియన్

ట్రెండ్ మార్చేసిన ప్రియదర్శి.. ఇట్స్ సీరియస్ అంటున్న కమెడియన్

ప్రియదర్శి అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. పెళ్లి చూపులు నుంచి నిన్నటి జాతి రత్నాలు వరకు ఆయన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే కామెడీ చేసాడు. సూపర్ గా నవ్వించాడు. అందుకే నేటి తరం కమెడియన్స్ లో టాప్ లో ఉన్నాడు ప్రియదర్శి. అయితే కామెడీతో పాటు అన్ని ఎమోషన్స్ పండించడంలో ఈయన ముందున్నాడు. నిజానికి పెళ్లి చూపులు సినిమాలకు ముందు రెండు మూడు సినిమాల్లో చాలా సీరియస్ కారెక్టర్స్ చేసాడు ప్రియదర్శి. అయితే అవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. పెళ్లి చూపులు తర్వాత అంతా కమెడియన్ ముద్ర వేసారు. కానీ ఈయన మాత్రం ఛాన్స్ దొరికిన ప్రతీసారి తాను అది మాత్రమే కాదని నిరూపించుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే ఈయన చేసిన మల్లేశం సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు ప్రియదర్శి. దాంతో పాటు ఆహాలో చేసిన కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రియదర్శిపై ఉన్న కమెడియన్ ముద్రను తొలగించేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి కొత్త తరహా వెబ్ సిరీస్ లో ప్రత్యక్షం అవుతున్నాడు ప్రియదర్శి. ”ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” (ING) అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వస్తుంది. అందులో మెయిన్ లీడ్ చేస్తున్నాడు ప్రియదర్శి. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఇందులో ప్రియదర్శి చాలా సీరియస్ రోల్ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ నందినీ రాయ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఆహాలో ఇది స్ట్రీమ్ కానుంది.

పోస్టర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే బాగా ట్రెండ్ అవుతుంది. ఇందులో గాయాలతో ప్రియదర్శి సిగరెట్ వెలిగించుకుంటూ సీరియస్ లుక్ లో కనిపిస్తుంటే.. నందిని రాయ్ కూడా చాలా ఇంటెన్స్ లుక్ లో ఉంది. ఈ పోస్టర్ ఆసక్తి రేకెత్తిస్తుంది. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. వరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించగా.. నిఖిల్ శ్రీకుమార్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆహా ఒరిజినల్స్ లో త్వరలోనే విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి..

18-05-2021 మంగ‌ళ‌వారం.. మీ రాశి ఫ‌లాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకా డోసులు : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌
తెరుచుకున్న బద్రీనాథ్‌ ఆలయం
ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం.. కొవిడ్‌ ప్రోటోకాల్‌ నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఈ నెలలో పదోసారి పెంపు..
రెజ్లర్‌ సుశీల్‌కుమార్‌పై రూ.లక్ష రివార్డు ప్రకటించిన ఢిల్లీ పోలీసులు
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24గంటల్లో 4,329 మంది మృతి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రెండ్ మార్చేసిన ప్రియదర్శి.. ఇట్స్ సీరియస్ అంటున్న కమెడియన్

ట్రెండింగ్‌

Advertisement