Seetha Kalyana Vaibhogame | మహిళా సమస్యలపై పోరాటం
సుమన్తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో యుగంధర్ నిర్మిస్తున్నారు.
Seetha Kalyana Vaibhogame | సుమన్తేజ్, గరీమ చౌహాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా కల్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వంలో యుగంధర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆడపిల్ల ఉండే ప్రతీ కుటుంబానికి ఈ సినిమా నచ్చుతుంది. చక్కటి ప్రేమకథతో పాటు నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించాం.
భావోద్వేగభరితంగా సాగుతూ ప్రేక్షకులకు మంచి సందేశాన్నందిస్తుంది’ అన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని, యువతరంలో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే అన్ని అంశాలుంటాయని నిర్మాత తెలిపారు. పాటలు మెలోడీ ప్రధానంగా అందరికీ నచ్చుతాయని సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, నిర్మాత విజయ్ కనకమేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

