Priya Bhavani Shankar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని నటి ప్రియా భవానీ శంకర్ Priya Bhavani Shankar. ఈ భామ నెక్ట్స్ అరుళ్ నిధి లీడ్ రోల్లో నటిస్తోన్న డెమొంటే కాలనీ 2లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ బ్యూటీ ఇటీవలే కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటించిన ఇండియన్ 2 Indian 2లో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించింన విషయం తెలిసిందే.
ఇందులో చిత్ర అరవింద్రన్ (సిద్దార్థ్) స్నేహితురాలు ఆర్తి తంగవేల్ పాత్రలో నటించింది. సమాజంలో జరిగే అవినీతి అక్రమాలపై సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించే గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించింది. అయితే ఇండియన్ 2లో తన పాత్రపై వస్తున్న విమర్శల మీద ప్రియా భవానీ శంకర్ స్పందించింది. కెరీర్లో తక్కువ టైంలోనే కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో నటించే అరుదైన అవకాశం దక్కడంతో విమర్శలను పక్కన పెట్టేయకుండా ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చింది.
సినిమా విడుదల తర్వాత ఆన్లైన్లో వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ.. ఓ ప్రెస్ మీట్లో లెజెండ్స్‌తో పని చేసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఈ భామ.. ఇండియన్ 2 సినిమాలో తన నటన ప్రేక్షకులకు ఏమైనా నిరాశ కలిగిస్తే క్షమించాలని కోరింది. ప్రియా భవానీ శంకర్ కామెంట్స్‌కు చాలా మంది నెటిజన్లు, సినీ జనాలు మద్దతుగా నిలిచారు. ఇండియన్ 2 ఈ శుక్రవారం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది.
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!